అద్భుత ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో Realme C1 (2019)
చైనా మొబైల్ మేకర్ ఒప్పోకు చెందిన రియల్‌మి Realme C1 (2019) భారత మార్కెట్లో లాంచ్ అయింది.
చైనా మొబైల్ మేకర్ ఒప్పోకు చెందిన రియల్‌మి Realme C1 (2019) భారత మార్కెట్లో లాంచ్ అయింది. గతంలో వచ్చిన Realme C1 డివైస్ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా Realme C1 (2019) రెండు వేరియంట్లలో కంపెనీ లాంచ్ చేసింది. Realme C1 కు మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి Realme C1 (2019)ను తీసుకొచ్చింది.ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు కానీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ స్లాట్లను ఏర్పాటు చేశారు. అందరూ ఊహించినట్టుగానే బడ్జెట్ ధరలోనే దీన్ని విడుదల చేసింది.

ఫీచర్లు...
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర
బేసిక్ మోడల్ 2జిబి ర్యామ్ ఫోన్‌ను రూ.7,499 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్‌ను నిర్వహించనున్నారు.

గతంలో విడుదలైన Realme C1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
ఫీచర్లు
6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








