Home
Mobile

Realme C11 Sale: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు ఇదే బెస్ట్ ఛాయస్...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో బడ్జెట్ ధరలో రియల్‌మి C-సిరీస్ విభాగంలో గత నెలలో విడుదల చేసిన రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ నేడు మరోసారి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా అమ్మకానికి వినియోగదారుల ముందుకు రానున్నది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్‌ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లతో పాటుగా 2GB RAM కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ యొక్క ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. దీనిని ఇప్పుడు రూ.7,499 ధర వద్ద రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆన్‌లైన్ సేల్ ఆఫర్ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ .500 వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. స్టాండర్డ్ EMI ఎంపికల విధానంలో కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.  

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్  

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్  

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌ మద్దతును కలిగి ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme C11 Goes Sale Once Again at 12 PM via Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X