Realme C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్ నేడే !! ఆఫర్ ధరలోనే మంచి అవకాశం...
బడ్జెట్ ధరలో ఇండియాలో రియల్‌మి C-సిరీస్ విభాగంలో గత నెలలో విడుదలైన రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ నేడు మరోసారి ఇండియాలో కొనుగోలు చేయడానికి వినియోగదారుల ముందుకు రానున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో లాంచ్ అయినప్పటి నుండి కేవలం ఫ్లాష్ సేల్స్ ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి C11 అప్‌గ్రేడ్ వెర్షన్ గా రియల్‌మి C12, రియల్‌మి C15
రియల్‌మి C11 యొక్క ఫీచర్ల విషయానికి వస్తే ఇది రివర్స్ ఛార్జింగ్ మరియు 32GB ఇన్‌బిల్ట్ స్టోరేజీ మద్దతుతో అతి పెద్ద 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G35 SoC చేత రన్ అవుతూ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కొద్ది రోజుల క్రితం కంపెనీ ఈ ఫోన్ కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా రియల్‌మి C12, రియల్‌మి C15 ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త ఫోన్లు మీడియాటెక్ హెలియో G35 SoC చేత రన్ అవుతూ అప్‌గ్రేడ్ కెమెరా ఫీచర్లను మరియు 6,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నాయి.

రియల్‌మి C11 ఇండియా సేల్
పరిమిత సమయంలో మాత్రమే అమ్మకానికి అందుబాటులోకి వచ్చే రియల్‌మి C11 యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా మొదలుకానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లతో పాటుగా 2GB RAM కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 ధరల వివరాలు
2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌లో లభించే రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర ఇండియాలో రూ.7,499. ఈ ఫోన్ ను రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆన్‌లైన్ సేల్ ఆఫర్ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ .500 వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. స్టాండర్డ్ EMI ఎంపికల విధానంలో కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్
రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్ మద్దతుతో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌కు మద్దతు ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది. రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ ఒక్క ఛార్జ్ మీద 40 రోజుల స్టాండ్‌బైతో రేట్ చేయబడి ఉంది.

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ LCD డిస్‌ప్లే డిజైన్
రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్
రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది పిక్సెల్ 4 సిరీస్ మాదిరిగానే రూపొందించబడింది. ఇందులో గల మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా క్రోమా బూస్ట్ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇది AI బ్యూటీ మోడ్ కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








