Home
Mobile

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme C11ను ఆఫర్ ధరలో పొందే గొప్ప అవకాశం

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా రెండు స్మార్ట్‌ఫోన్లను వాడటం సర్వసాధారణం అయింది. వారి యొక్క వ్యాపార మరియు ఇతర కారణాల వలన ఎక్కువ మందితో వేరు వేరుగా కనెక్ట్ అవ్వడానికి రెండు లేదా మూడు ఫోన్లను వాడుతూ ఉంటారు. ఇందులో మొదటి దాన్ని అధిక ధర వద్ద కొనుగోలు చేసిన రెండవ దానిని బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అటువంటి వారి కోసం రియల్‌మి C11 అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లతో సరిగ్గా సరిపోతుంది.

రియల్‌మి C11 ఇండియా సేల్

రియల్‌మి C11 ఇండియా సేల్

ఇండియాలో గత నెలలో విడుదల అయిన ఈ ఫోన్ పరిమిత సమయంలో మాత్రమే అమ్మకానికి అందుబాటులోకి వస్తోంది. అటువంటి రియల్‌మి C11 యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా మొదలుకానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్‌ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లతో పాటుగా 2GB RAM కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 ఇండియాలో ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల అయింది. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌ యొక్క ధర ఇండియాలో  రూ.7,499. ఈ ఫోన్ ను రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ అమ్మకపు ఆఫర్ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ .500 వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. స్టాండర్డ్ EMI ఎంపికల విధానంలో కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌కు మద్దతు ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది. రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ యొక్క బ్యాటరీ ఒక్క ఛార్జ్ మీద 40 రోజుల స్టాండ్‌బైతో రేట్ చేయబడి ఉంది.

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ LCD డిస్‌ప్లే డిజైన్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ LCD డిస్‌ప్లే డిజైన్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి C11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది పిక్సెల్ 4 సిరీస్ మాదిరిగానే రూపొందించబడింది. ఇందులో గల మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇది AI బ్యూటీ మోడ్ కలిగి ఉంటుంది. 

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C11 Sale in India Today at 12 PM via Flipkart and Realme Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X