Home
Mobile

6,000mAh పెద్ద బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయిన Realme C15,C12 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మి నేడు ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రియల్‌మి C12 మరియు రియల్‌మి C15 పేరుతో లభించే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ రోజు మధ్యాహ్నం 12.30PM కు రియల్‌మి ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్‌ మరియు యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా లాంచ్ చేసింది. 6,000 mAh బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 3GBర్యామ్ + 32 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,999 కాగా 4GBర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.10,999. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో ఆగష్టు 27 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించనున్నాయి.

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

బడ్జెట్ ధరలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. 3GBర్యామ్ + 32 GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో విడుదలైన ఫోన్ యొక్క ధర 8,999రూపాయలు. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో ఆగష్టు 24 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి C15, C12 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C15, C12 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C15 మరియు C12 స్మార్ట్‌ఫోన్లు రెండూ కూడా‌ ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ కెమెరా సెటప్ విషయంలో మాత్రం కొన్ని తేడాలను కలిగి ఉన్నాయి. ఇవి 6.5-అంగుళాల మినీ-డ్రాప్-ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మరియు హెలియో G35 చిప్‌సెట్ ను కలిగి ఉండి 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. అలాగే ఇవి ఆండ్రాయిడ్ 10 ఆధారిత మరియు రియల్‌మి యొక్క కస్టమ్ UI తో రన్ అవుతుంది.

రియల్‌మి C15 కెమెరా సెటప్

రియల్‌మి C15 కెమెరా సెటప్

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఏపర్చుర్ తో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమరా,  f/2.4 ఏపర్చుర్ తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు  f/2.2 ఏపర్చుర్ తో రెండు 2-మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ మైక్రో-డెప్త్ మరియు మోనో కెమెరాలను కలిగి ఉన్నాయి. దీని యొక్క రియర్ కెమెరా సెటప్ ఐఫోన్ ఆకృతిలో కలిగి ఉంటుంది.  అలాగే ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C12 కెమెరా సెటప్

రియల్‌మి C12 కెమెరా సెటప్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఏపర్చుర్ తో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమరామరియు 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. దీని యొక్క రియర్ కెమెరా సెటప్ ఐఫోన్ ఆకృతిలో కలిగి ఉంటుంది.  అలాగే ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ లో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C15, C12 స్మార్ట్‌ఫోన్‌ల 6,000mAh బ్యాటరీ

రియల్‌మి C15, C12 స్మార్ట్‌ఫోన్‌ల 6,000mAh బ్యాటరీ

రియల్‌మే C15, C12 స్మార్ట్‌ఫోన్‌లు రెండు కూడా 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇవి కేవలం 30నిమిషాలలో 25% వరకు ఛార్జ్ చేయగలవు. దీని యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో 57రోజుల స్టాండ్ బై సమయం, 46గంటల కాలింగ్ సమయం, 10.2 గంటల గేమింగ్ కోసం,18.6 గంటలు ఆన్ లైన్ లో సినిమాలను చూడడానికి 1200నిముషాలు సాంగ్స్ వినడానికి వీలుగా ఉంటుంది. మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్‌తో పనిచేసే ఫోన్లు గేమింగ్ కోసం అనువుగా ఉన్నాయి. అలాగే సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇవి రియల్‌మి UI ఆధారిత ఆండ్రాయిడ్10 తో రన్ అవుతాయి.

Best Mobiles in India

English summary
Realme C15, C12 SmartphoneS Released in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X