Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్
ఇండియాలో రియల్‌మి యొక్క C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మంచి విజయాన్ని సాధించాయి. ఇందులో భాగంగా ఈ రోజు రియల్‌మి యొక్క C3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. రూ.10 వేల లోపు బడ్జెట్ ధరలో వస్తున్న ఈ ఫోన్ రియల్‌మిC1 మరియు రియల్‌మి C2 స్మార్ట్‌ఫోన్‌ల లాగ మంచి విజయాన్ని సాధిస్తాయి.

ఇవి రెండు సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి అని లాంచ్ ఈవెంట్ లో రియల్‌మి ఇండియా CEO మాధవ్ శేత్ తెలిపారు. రియల్‌మి C3 యొక్క దరల వివరాలు, సేల్స్ డేట్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.6,999 మరియు 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,999 లుగా ఉంది. దీని యొక్క మొదటి సేల్ వాలెంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14 నుండి మొదలు కానున్నాయి.

సేల్స్ ఆఫర్స్
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్బంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క సొంత వెబ్ సైట్ లో మొదలుకానున్నాయి. మొదటి సేల్స్ సందర్బంగా ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ .1,000 తగ్గింపును కూడా అందిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు కొనుగోలు మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నో-కాస్ట్ EMI ఎంపికలలో నెలకు రూ.584 నుంచి మొదలవుతాయి. అదనపు ఆఫర్లలో భాగంగా రూ.7,550 ల విలువైన జియో ఆఫర్లను పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ 20: 9 కారక నిష్పత్తితో మరియు 89.8 శాతం స్క్రీన్-బాడీ-రేషియో గల 6.5-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది రియల్‌మి 5i మాదిరిగానే సన్‌రైజ్ డిజైన్‌ను అందిస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ తో తయారుచేయబడిన మొదటి ఫోన్ ఇదే కావడం మరొక విశేషం. ఇది 12nm మీడియాటెక్ హెలియో ప్రాసెసర్ మరియు 2.0GHz వద్ద క్లాక్ చేయబడి ఉంటుంది.

కెమెరా
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ రెండు సిమ్ కార్డులు మరియు ఒక SD కార్డు కోసం ట్రిపుల్ కార్డ్ స్లాట్‌కు మద్దతును అందిస్తుంది. SD కార్డ్ స్లాట్ ద్వారా వినియోగదారులు మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. అలాగే పోర్ట్రెయిట్‌ల మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇది HDR, నైట్‌స్కేప్, క్రోమా బూస్ట్ మరియు స్లో-మోషన్ కు కూడా మద్దతునిస్తుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.

కనెక్టివిటీ
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి మైక్రో యుఎస్‌బి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. రియల్‌మి C3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ నానో-సిమ్ కార్డులు, VoLTE, 2.4G వై-ఫై, బ్లూటూత్ 5.0 వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్‌లోని సెన్సార్లలో GPS, Beidou, Glonass, A-GPS, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో-మీటర్, యాక్సిలెరోమీటర్ మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications