Realme C3 Sale ప్రారంభం... డిస్కౌంట్ ఆఫర్స్ అదుర్స్...

|

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు భారతదేశంలో తొలిసారిగా అమ్మకాలకు సిద్ధమైంది. గత వారం దేశంలో తక్కువ ధరల వద్ద లాంచ్ అయిన ఈ కొత్త రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C2కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా వచ్చింది. ఇది HD + డిస్ప్లేను కలిగి ఉండడంతో పాటుగా మీడియాటెక్ హెలియో G70 SoC ని కలిగి ఉంటుంది.

రియల్‌మి C3

రియల్‌మి C3 యొక్క ఇతర ముఖ్య ముఖ్యాంశాలలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ నాచ్ -స్టైల్ డిస్ప్లే మరియు 4GB వరకు ర్యామ్ ఉంటుంది. ఇది మూడు విభిన్న కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి 8 కి అప్‌గ్రేడ్‌గా షియోమి ఇటీవల ప్రారంభించిన డ్యూయల్‌ కెమెరా రెడ్‌మి 8A తో రియల్‌మి C3 పోటీపడుతుంది.

 

 

Xiaomi Mi 10: మొట్టమొదటి 108MP కెమెరా షియోమి ఫోన్ ఎలా ఉందొ చూడండి!!Xiaomi Mi 10: మొట్టమొదటి 108MP కెమెరా షియోమి ఫోన్ ఎలా ఉందొ చూడండి!!

ధరలు మరియు లభ్యత వివరాలు
 

ధరలు మరియు లభ్యత వివరాలు

భారతదేశంలో రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరలు వరుసగా 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.6,999 కాగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7,999లుగా ఉన్నాయి. ఈ రెండు ఎంపికలు బ్లేజింగ్ రెడ్ మరియు ఫ్రోజెన్ బ్లూ కలర్ షేడ్స్ లో లభిస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

 

 

Samsung Galaxy S20 5G Series, Galaxy Z Flip : మొదలైన ప్రీ-రిజిస్ట్రేషన్లుSamsung Galaxy S20 5G Series, Galaxy Z Flip : మొదలైన ప్రీ-రిజిస్ట్రేషన్లు

సేల్స్ ఆఫర్స్ వివరాలు

సేల్స్ ఆఫర్స్ వివరాలు

రియల్‌మి C3 యొక్క సేల్స్ ఆఫర్‌లలో భాగంగా జియో యొక్క రూ. 349 ప్లాన్ రీఛార్జిపై రూ.7,550ల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. మొదటి సేల్స్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు వారి పాత స్మార్ట్‌ఫోన్‌ మీద కనీసం రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంకు ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద 5% తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద నో-కాస్ట్ EMI ఎంపిక కూడా లభిస్తుంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ 20: 9 కారక నిష్పత్తితో మరియు 89.8 శాతం స్క్రీన్-బాడీ-రేషియో గల 6.5-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది రియల్‌మి 5i మాదిరిగానే సన్‌రైజ్ డిజైన్‌ను అందిస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ తో తయారుచేయబడిన మొదటి ఫోన్ ఇదే కావడం మరొక విశేషం. ఇది 12nm మీడియాటెక్ హెలియో ప్రాసెసర్ మరియు 2.0GHz వద్ద క్లాక్ చేయబడి ఉంటుంది.

 

 

Airtel xstream వాడుతున్నారా!!! ఈ లాంగ్-టర్మ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండిAirtel xstream వాడుతున్నారా!!! ఈ లాంగ్-టర్మ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ రెండు సిమ్ కార్డులు మరియు ఒక SD కార్డు కోసం ట్రిపుల్ కార్డ్ స్లాట్‌కు మద్దతును అందిస్తుంది. SD కార్డ్ స్లాట్ ద్వారా వినియోగదారులు మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. అలాగే పోర్ట్రెయిట్‌ల మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇది HDR, నైట్‌స్కేప్, క్రోమా బూస్ట్ మరియు స్లో-మోషన్ కు కూడా మద్దతునిస్తుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.

 

 

BSNL Prepaid Plans:ప్రైవేట్ టెల్కోలకు దీటుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లుBSNL Prepaid Plans:ప్రైవేట్ టెల్కోలకు దీటుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

కనెక్టివిటీ

కనెక్టివిటీ

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి మైక్రో యుఎస్‌బి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. రియల్‌మి C3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ నానో-సిమ్ కార్డులు, VoLTE, 2.4G వై-ఫై, బ్లూటూత్ 5.0 వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్‌లోని సెన్సార్లలో GPS, Beidou, Glonass, A-GPS, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో-మీటర్, యాక్సిలెరోమీటర్ మొదలైనవి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme C3 Sale Starts Today in India via Flipkart and Realme.com: Price, Discounts, Specs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X