5,000mAh బ్యాట‌రీతో, అతి త‌క్కువ ధ‌ర‌కు Realme C30s విడుద‌ల‌!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ Realme, భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రింప‌చేస్తోంది. తాజాగా మ‌రో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచయం చేసింది. Realme C30s పేరుతో స‌రికొత్త మోడ‌ల్ మొబైల్‌ను గురువారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

 
5,000mAh బ్యాట‌రీతో, అతి త‌క్కువ ధ‌ర‌కు Realme C30s విడుద‌ల‌!

ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా, దీనికి octa-core Unisoc SC9863A chipset అందిస్తున్నారు. Realme C30s అనేది డ్యూయల్-సిమ్ (నానో) 4G స్మార్ట్‌ఫోన్, ఇది ఇంట‌ర్నల్ స్టోరేజీని విస్తరించడానికి (1TB వరకు) ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఉంటుంది.

భారతదేశంలో Realme C30s ధర, లభ్యత:
Realme C30s ర్యామ్‌, ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో వస్తుంది. 2GB RAM + 32GB స్టోరేజీ ఒక‌టి కాగా, మ‌రొకటి, 4GB RAM + 64GB స్టోరేజీ క‌లిగి ఉంది. వీటి ధ‌ర‌లు రూ.7,499 మరియు రూ.8,999 గా నిర్ణ‌యించారు. ఇది స్ట్రైప్ బ్లాక్ మరియు స్ట్రైప్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వస్తుంది. ఈ మోడ‌ల్ మొబైల్స్ భారతదేశంలో సెప్టెంబర్ 22 వ తేదీ ఉదయం 12 గంటల నుంచి ముందుగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ స‌భ్యుల‌కు సేల్‌కు అందుబాటులోకి వ‌స్తాయి. ఆ త‌ర్వాత మిగిలిన కస్టమర్‌లు సెప్టెంబర్ 23 ఉదయం 12 గంటల నుంచి Flipkart మరియు Realme India ఆన్‌లైన్ స్టోర్ నుండి ఈ Realme స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది.

5,000mAh బ్యాట‌రీతో, అతి త‌క్కువ ధ‌ర‌కు Realme C30s విడుద‌ల‌!

Realme C30s స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
Realme C30s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. Realme C30s ఆక్టా-కోర్ Unisoc SC9863A SoC ద్వారా శక్తిని పొందుతుంది. మరియు Realm UI Go ఎడిషన్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ద్వారా ర‌న్ అవుతుంది. ఇది మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా ఎక్స్‌ప్యాండ‌బుల్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. 4GB RAM మరియు 64GB వరకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది.

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. Realme C30s మొబైల్ f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ AI ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ 30fps వద్ద ఫుల్‌ HD వీడియోలను రికార్డ్ చేయగలదు, అయితే సెల్ఫీ కెమెరా 30fps వద్ద HD వీడియోలను రికార్డ్ చేయగలదు.

ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడింది. హ్యాండ్‌సెట్ మైక్రో-టెక్చర్ స్లిప్-రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. Realme C30s దీర్ఘకాలిక 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది కనెక్టివిటీ ప‌రంగా.. 2.4GHz Wi-Fi మరియు బ్లూటూత్ v4.2 సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB 2.0 మైక్రో-USB పోర్ట్ కూడా ఉన్నాయి. ఇది మెరుగైన స్టీరియో ఆడియో అవుట్‌పుట్ కోసం Dirac 3.0 టెక్నాలజీతో వస్తుంది.

 
5,000mAh బ్యాట‌రీతో, అతి త‌క్కువ ధ‌ర‌కు Realme C30s విడుద‌ల‌!

అదేవిధంగా, భార‌త మార్కెట్లో Realme కంపెనీ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్ గురించి కూడా తెలుసుకుందాం:

Realme Watch 3 Pro స్పెసిఫికేష‌న్లు:
Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్‌ 368x448 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వ‌స్తోంది. ఇది ఆల్బమ్ వాచ్ ఫేస్‌లతో సహా 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతును అందిస్తుంది. ఇది నిరంతర GPS ఆపరేషన్‌లో భాగంగా బ్యాటరీ 20 గంటల వరకు ఉంటుందని Realme తెలిపింది. ఇది లొకేషన్ ట్రాకింగ్‌లో వినియోగదారులకు సహాయపడే ఐదు GNSS సిస్టమ్‌లతో వస్తుంది. దీనికి బ్లూటూత్ కాలింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది.

Realme Watch 3 Proలో హృదయ స్పందన రేటు, స్టెప్ మరియు స్లీప్ ట్రాకింగ్ కోసం SpO2 మానిట‌రింగ్ క‌లిగిన సెన్సార్లు ఉన్నాయి. ఇతర ఆరోగ్య సంబంధిత లక్షణాలలో స్ట్రెస్ మానిట‌రింగ్‌, స్త్రీల‌ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించే ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్-సంబంధిత ఫీచర్ల విషయానికొస్తే, వర్కౌట్ ట్రాకింగ్ కోసం Realme Watch 3 Pro వాచ్ 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. రియల్‌మీ యాప్‌ని ఉపయోగించి శిక్షణ గణాంకాలను ట్రాక్ చేయడానికి కూడా స్మార్ట్‌వాచ్ అనుమతిస్తుంది. దీనికి 345mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీ ఉంది, ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా గరిష్టంగా 10 రోజుల వరకు బ్యాట‌రీ లైఫ్ పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడిన Realme Watch 3 Pro ధర రూ.4,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది Realme.com, Flipkart మరియు మెయిన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme C30s Mobile launched in india with budget price. here details about entry level mobile

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X