50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ రియల్‌మి C51ను ( Realme C51 Smartphone Price Drop ) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ ప్లాట్‌ఫాంలో విడుదల ధరతో పోలిస్తే 18 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. విడుదల సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.8,999 కే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్ సెట్ 50MP కెమెరా సహా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ 1600*720 పిక్సల్ రిజల్యూషన్ తో 6.7 అంగుళాల పుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వచ్చింది. మరియు 560 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 7.99mm మందంతో (Thickness) ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది.

33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ రియల్‌మి హ్యాండ్ సెట్ Unisoc T612 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. 4GB వర్చువల్ ర్యామ్ ను సపోర్టు చేస్తుంది. 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
50MP కెమెరా సహా :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI కెమెరా, 0.08MP కెమెరా అమర్చారు. దీంతోపాటు ఫ్లాష్ లైట్ కలిగి ఉంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్ లో మెరుగైన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్ సెట్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications