ధర రూ.10,000 కే,108MP కెమెరా తో కొత్త ఫోన్ లాంచ్! సేల్ తేదీ, స్పెసిఫికేషన్లు
రియల్ మీ సంస్థ భారతదేశంలో తన బడ్జెట్ C సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది Realme C53 గా వస్తుంది, 6GB వరకు RAM, 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. కానీ ఈ ఫోన్ దాని 108MP కెమెరా కారణంగా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ కెమెరా తో వచ్చే ఫోన్లలో C-సిరీస్‌లో ఇదే మొదటిది. Realme C53 రెండు వేరియంట్‌లలో వస్తుంది మరియు దీని ధర రూ. 10,000 కంటే తక్కువ ఉంటుంది. భారతదేశంలో ఈ రియల్ మీ C53 ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు మరియు లభ్యత యొక్క వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Realme C53 ఫోన్ యొక్క ఇండియా ధర, మరియు లభ్యత వివరాలు
ఈ రియల్ మీ C53 ఫోన్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు రూ.9,999. ధర తో మరియు 6GB RAM , 64GB స్టోరేజీ ధర రూ. 10,999 తో వస్తుంది. ఈ రియల్ మీ C53 మొదటి సేల్ జూలై 26న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఇది realme.com, Flipkart మరియు రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
రియల్ మీ సంస్థ ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్‌పై రూ. 1,000 వరకు తగ్గింపును అందిస్తోంది. లాంచ్ ఆఫర్‌గా, ICICI, HDFC మరియు SBI కార్డ్ లావాదేవీల ద్వారా ఈ రూ. 1,000 తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఛాంపియన్ గోల్డ్ మరియు ఛాంపియన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
రియల్ మీ C53 స్మార్ట్ ఫోన్ ఈ నెల జూలై 26 నుండి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్ మీ స్టోర్ ద్వారా సేల్ చేయబడుతుంది. రియల్ మీ అభిమానుల కోసం ప్రత్యేక సేల్ కూడా నిర్వహిస్తోంది, ఇది ఈరోజు (జూలై 19) సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, రియల్ మీ స్టోర్‌లో ప్రత్యేక సేల్ లో భాగంగా జూలై 24, 12:00-2:00 PMకి Realme C53 కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
రియల్ మీ C53 స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ రియల్ మీ C53 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD డిస్‌ప్లే మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ T612 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM+ 128GB మరియు 6GB RAM+ 64GB యొక్క రెండు వేరియంట్‌లతో పాటు 12GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది.
ఇక కెమెరా వివరాలు గమనిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో B&W లెన్స్‌తో పాటు 108MP ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇంకా, ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రియల్ మీ UI T ఎడిషన్ తో పనిచేస్తుంది. చివరగా, కనెక్టివిటీ ఆప్షన్లు చూస్తే, ఇందులో 4G LTE, బ్లూటూత్ 5.0, Wi-Fi, USB టైప్-C పోర్ట్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








