Home
Mobile

ధర రూ.8199 కే 5000mAh బ్యాటరీ. 6.74 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి గత సంవత్సరం ఎంట్రీ లెవల్‌ ధరలో రియల్‌మి C61 స్మా్ర్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మెటాలిక్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఆర్మర్‌ షేల్‌ రక్షణను పొందుతుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ను ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీ, 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్‌ పూర్తి వివరాలు.

భారత్‌లో రియల్‌మి C61 స్మార్ట్‌ ఫోన్‌ (Realme C61 Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 4GB ర్యామ్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7699, 6GB ర్యామ్ ధర రూ.8999 గా ఉంది. ప్రస్తుతం 6GB స్టోరేజీ మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Realme C61 Smartphone

ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) రియల్‌మి C61 హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.8199 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మార్బుల్‌ బ్లాక్‌, సఫారీ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.74 అంగుళాల (1600*720 పిక్సల్స్‌) HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 560 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

ఎన్నో సూపర్‌ ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ మెటాలిక్‌ ఫ్రేమ్‌, రీన్‌ఫోర్స్‌డ్‌ గ్లాస్‌, ఆర్మర్‌ షేల్‌ రక్షణను కలిగి ఉంది. దీంతోపాటు ఎయిర్‌ గెశ్చర్స్‌, మినీ క్యాప్సుల్‌ 2.0, రెయిన్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ లను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ ను వినియోగించుకొనేందుకు అనువుగా ఉంటుంది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ అండర్‌ ది హుడ్‌ ఆక్టాకోర్ Unisoc T612 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. గరిష్ఠంగా 6GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీ జతచేసి ఉంది. మరియు ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI ని కలిగి ఉంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

కెమెరా, బ్యాటరీ వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 32MP ప్రైమరీ కెమెరా, AI లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ రియల్‌మి ఫోన్‌ ముందు వైపు 5MP కెమెరాను కలిగి ఉంది. 10W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుత 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

IP54 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ 4G సపోర్టు, Wi-Fi 5, బ్లూటూత్ 5.0, USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 187 గ్రాముల బరువును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను అమర్చి ఉంది.

Best Mobiles in India

English summary
Realme C61 Smartphone gets best deal on Flipkart 2025 check features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X