రూ.10,000 కంటే తక్కువ ధరలో సూపర్ ఫీచర్‌లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్... ఎప్పుడు విడుదల కానుందంటే?
రియల్‌మి నుంచి ఇటీవలే GT 6 స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. అయితే త్వరలో రియల్‌మి నుంచి మరో హ్యాండ్ సెట్ విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా రియల్‌మి C61 స్మార్ట్ ఫోన్ జూన్ 28న భారత్‌లో ( Realme C61 Launch Date in india ) విడుదల కానుంది. ఫ్లిప్ కార్ట్ ఆధారంగా ఈ హ్యాండ్ సెట్ మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు రీన్‌ఫోర్స్‌డ్ గ్లాస్ సహా ఆర్మర్ షేల్ రక్షణను కలిగి ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ ఫోటోల ఆధారంగా ఈ రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ మెటాలిక్ బాడీ సహా మెరుగైన స్పెసిఫికేషన్లు ఫీచర్‌లను కలిగి ఉండనుంది. IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది. దీంతోపాటు డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ (Realme Upcoming Smartphones in india) ఆకట్టుకుంటుంది.

రియల్‌మి C61 స్మార్ట్ ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
కొన్ని నివేదికల ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ 1600*720 పిక్సల్ రిజల్యూషన్ తో HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి హ్యాండ్ సెట్ ఎయిర్ గెశ్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సుల్ 2.0 నాచ్ మరియు రెయిన్ స్మార్ట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
5000mAh బ్యాటరీ :
రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు Unisoc Speedtrum T612 చిప్ సెట్ పైన పనిచేయనుందని తెలుస్తోంది. ఈ రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

50MP కెమెరా, రెండు వేరియంట్‌లు..! :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రధాన కెమెరా సహా AI లెన్స్ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గ్రీన్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుందని తెలుస్తోంది.
అయితే ఈ హ్యాండ్ సెట్ ధరపై రియల్‌మి, ఫ్లిప్ కార్ట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.10000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు పైన పేర్కొన్న స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లపై రియల్‌మి, ఫ్లిప్ కార్ట్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications