Home
Mobile

ధర రూ.7699 కే 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నుంచి ఇవాళ భారత్‌ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ ధరలో కొత్త హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. రూ.7699 ధరకే రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్‌ (Realme C61 Smartphone Launched in India) లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీ, 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ మెటాలిక్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు రీన్‌ఫోర్స్‌డ్‌ గ్లాస్‌ సహా ఆర్మర్‌ షేల్‌ రక్షణను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎయిర్‌ గెశ్చర్‌, మినీ క్యాప్సుల్‌ 2.0 నాచ్‌, రెయిన్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

Realme C61 Smartphone sale

రియల్‌మి C61 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 560 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ 187 గ్రాముల బరువు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

ఈ రియల్‌మి C61 హ్యాండ్‌ సెట్‌ అండర్‌ ది హుడ్‌ ఆక్టాకోర్ Unisoc T612 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. 6GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI ని కలిగి ఉంది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 32MP ప్రధాన కెమెరా సహా AI కెమెరాతో అందుబాటులో వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 5MP కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి C61 స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.0, Wi-Fi 5, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ మినీ క్యాప్సుల్ 2.0 నాచ్‌తో అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి C61 4G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ రియల్‌మి C61 4G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,699, 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,499, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్‌ వేరియంట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. SBI, HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.900 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ (Realme.Com), ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. సఫారీ గ్రీన్, మార్బుల్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C61 Smartphone launched in india specifications features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X