Home
Mobile

ధర రూ.9999 కే 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ, HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లో అనేక బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆకట్టుకొనే డిజైన్‌ సహా ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ అనేక ఫీచర్‌లతోపాటు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5000mAh బ్యాటరీ సహా గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు :
రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్ (Realme C63 5G Smartphone Price drop) విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.11,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది.

Realme C63 5G Smartphone design

రూ.1000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ వేరియంట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఫోన్‌ ధర రూ.9,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ వేరియంట్ విడుదల సమయంలో రూ.11,999 ఉండగా.. ప్రస్తుతం రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ వేరియంట్‌పై రూ.1750 డిస్కౌంట్ :
దీంతోపాటు అన్ని బ్యాంకు కార్డులపై రూ.750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే సుమారు రూ.1750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఫారెస్ట్‌ గ్రీన్‌, స్టర్రీ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

Realme C63 5G Smartphone design

రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ (720*1604 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. గరిష్ఠంగా 16GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

Realme C63 5G Smartphone design

మిని క్యాప్సల్‌ 2.0 ఫీచర్‌ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 పైన పనిచేస్తోంది. రెండు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ మిని క్యాప్సల్‌ 2.0 ఫీచర్‌ ను కలిగి ఉంది.

కెమెరా, బ్యాటరీ వివరాలు :
రియల్‌మి C63 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

సింగిల్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ ఏకంగా 29 రోజులపాటు స్టాండ్‌బై టైంను అందిస్తుందని రియల్‌మి తెలిపింది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C63 5G Smartphone gets Rs1000 discount with all bank cards on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X