Home
Mobile

ధర రూ.8999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. నిమిషం ఛార్జింగ్‌తో గంటపాటు ఫోన్‌ మాట్లాడుకోవచ్చు!

రియల్‌మి ఇటీవల భారత్‌ మార్కెట్‌లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల చేస్తోంది. ముఖ్యంగా ఎం‌ట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల రియల్‌మి C61 హ్యాండ్‌సెట్‌ ను కేవలం రూ.7699 కే విడుదల చేసింది. అయితే తాజాగా మరో ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుంది. రియల్‌మి C63 స్మార్ట్‌ఫోన్ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ లో (Realme C63 Smartphone) కనిపిస్తోంది. దీంతోపాటు స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్‌ ఆధారంగా రియల్‌మి C63 స్మా్ర్ట్‌ఫోన్‌ సేల్ జులై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క నిమిషం పాటు ఛార్జింగ్‌ చేసి, గంటపాటు ఫోన్‌ కాల్‌ మాట్లాడుకొనే వీలుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు గ్రీన్, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

realme C63 Smartphone sale

ధర రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు :
దీంతోపాటు రియల్‌మి ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ధరను కూడా విడుదల చేసింది. 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 కే లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఇండోనేషియాలో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది.

రియల్‌మి C63 స్మార్ట్‌ ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి C63 స్మార్ట్‌ ఫోన్‌ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 560 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.

realme C63 Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ అండర్‌ ది హుడ్‌ ఆక్టా కోర్‌ UNISOC T612 చిప్‌సెట్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ Mali G57 GPU తో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Realme UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ రియల్‌మి C63 హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

ప్రీమియం లెదర్‌, 5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లోనే తొలి ప్రీమియం లెదర్‌ డిజైన్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఎయిర్‌ గెశ్చర్స్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సుల్‌ 2.0, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌ 5.0, వైఫై 5 ఫీచర్‌లను కలిగి ఉండనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
realme C63 Smartphone price and sale date revealed in india specs features price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X