రూ.8999 కే 50MP కెమెరా, 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఫోన్ సేల్ ప్రారంభం.. పూర్తి వివరాలు..!
రియల్‌మి సంస్థ నుంచి జులై 1వ తేదీన రియల్‌మి C63 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.8999 గా ఉంది. అయితే ఈ సెగ్మెంట్‌లో వేగాన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. మరియు HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ సేల్ ప్రారంభం (Realme C63 Smartphone Sale) అయింది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లి్‌ప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి C63 తొలిసేల్ ఇవాళ్టి నుంచి జులై 6 అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా మొబిక్విక్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

దీంతోపాటు రియల్‌మి వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.999 కే బడ్స్ T100 ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. జడే గ్రీన్, లెదర్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేసేందుకు లభిస్తుంది.
రియల్‌మి C63 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి C63 స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ Unisoc T612 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. 4GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యండ్‌సెట్ f/1.8 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్ 5.0, వైఫై 5 ఫీచర్‌లను కలిగి ఉండనుంది. మినీ క్యాప్సుల్ 2.0, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








