Home
Mobile

రూ.9999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవాళే తొలి సేల్‌!!

రియల్‌మి సంస్థ తాజాగా భారత్‌ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme C65 5G Smartphone Launched) లాంచ్‌ చేసింది. రూ.10,499 ధరకే మెరుగైన ఫీచర్‌లతో 5G హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. 6.67 అంగుళాల డిస్‌ప్లేతో మూడు వేరియంట్లులో అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 89.97 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోతో లాంచ్‌ అయింది. Feather గ్రీన్‌ మరియు గ్లోయింగ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Realme C65 5G Smartphone

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 OS (Out Of The Box) మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ తో జతచేయబడింది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. 2 సంవత్సరాలపాటు OS, 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు f/1.8 అంగుళాల అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో మెరుగైన కెమెరాలను కలిగి ఉన్నట్లయింది.

Realme C65 5G Smartphone

కొత్త హ్యాండ్‌సెట్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రిటైల్‌ బాక్స్‌లో ఛార్జర్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా ఉండనుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది.

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ ధర : రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10499 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.

ఇవాళ తొలి సేల్‌ : రియల్‌మి C65 5G స్మార్ట్‌ ఫోన్ తొలి సేల్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌పైన రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.9999 గా ఉండనుంది. మిలిగిన రెండు వేరియంట్ల పైన రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Realme C65 5G Smartphone Launched in india specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X