Home
Mobile

ధర రూ.10,000 కంటే తక్కువ ధరకే 50MP, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ వివరాలు..!

రియల్‌మి నుంచి ఏప్రిల్‌లో భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.10,499 గా ఉంది. ఇటీవల ఈ హ్యాండ్‌సెట్‌ కొత్త కలర్‌ వేరియంట్‌లో (Realme C65 5G New Variant) లాంచ్‌ అయింది. ఇప్పటి వరకు Feather గ్రీన్‌ మరియు గ్లోయింగ్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉండగా.. తాజాగా స్పీడీ రెడ్‌ కలర్‌ వేరియంట్‌లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ జూన్‌ 14 నుంచి ప్రారంభం కానుంది.

రూ.1000 తగ్గింపు.. :
రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10499 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఈ స్పీడీ రెడ్‌ వేరియంట్‌ను రూ.1000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

realme C65 5G smartphone speedy red colour variant gets RS1000 discount

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 89.97 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. మరియు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Mali G57 MC2 GPU తో జతచేయబడుతుంది. మరియు 6GB LPDDR4X ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీతో అందించబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 2 సంవత్సరాలపాటు OS, 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు f/1.8 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. డైనమిక్‌ బటన్‌, ఎయిర్‌ గెశ్చర్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
realme C65 5G smartphone speedy red colour variant sale starts from june 14 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X