ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
రియల్ సంస్థ భారత్ మార్కెట్‌లో మరో కొత్త హ్యాండ్ సెట్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి C65 5G స్మార్ట్ ఫోన్ (Realme C65 5G Smartphone) విడుదల కానుంది. ఆ హ్యాండ్ సెట్‌ను రూ.10,000 ధరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి P1 5G సిరీస్ తరహా డిజైన్‌ను ఈ C65 హ్యాండ్ సెట్ కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కింది వైపున స్పీకర్లు, USB-C ఛార్జింగ్ పోర్టు, హెడ్ ఫోన్ జాక్‌ను అమర్చారు. రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మి C65 5G అంచనా స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C65 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి అండే అవకాశం ఉంది. అలాగే 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం.
ప్రపంచంలోనే తొలిసారిగా..!
ఈ హ్యాండ్ సెట్ ప్రపంచంలోనే తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్‌ను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రూ.10,000 ధర సెగ్మెంట్‌లోనే :
రియల్‌మి C65 5G స్మార్ట్ ఫోన్ (Realme 5G Smartphone Under RS10K) ధరపై సంస్థ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. భారత్ మార్కెట్‌లోకి ఈ హ్యాండ్ సెట్‌ను రూ.10,000 ధర సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే పైన తెలిపిన మిగిలిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లపైన రియల్‌మి సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
మరో రెండు స్మార్ట్ ఫోన్‌లు :
రియల్‌మి సంస్థ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఏప్రిల్ 24న నార్జో 70x 5G, నార్జో 70 5G హ్యాండ్ సెట్‌లు లాంచ్ కానున్నాయి. 70x 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.12,000 సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అదే నార్జో 70 ధర రూ.15,000 గా ఉండే అవకాశం ఉంది.
రియల్‌మి నార్జో 70 5G స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు VC కూలింగ్ సిస్టమ్ ఫీచర్‌తో లాంచ్ కానుంది. మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తో విడుదల కానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








