Home
Mobile

రియల్‌మి కొత్త ఫోన్‌ టీజర్ విడుదల.. సెగ్మెంట్‌లోనే సన్నని డిజైన్‌ సహా కీలక ఫీచర్లు..!

రియల్‌మి నుంచి త్వరలో మరో కొత్త ఫోన్‌ విడుదల కానుంది. రియల్‌మి C65 హ్యాండ్‌సెట్ ఆసియాలో ఎంపిక చేసిన మార్కెట్‌లలో విడుదల అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం లాంచ్‌ అయిన C55 ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ ఇప్పటికే అనేక సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది.

తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లను రియల్‌మి సంస్థ సీనియర్ అధికారి వెల్లడించారు. ఫలితంగా డిజైన్ సహా ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ రియల్‌మి C65 స్మార్ట్‌ఫోన్ (Realme C65 Smartphone Teased) ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Realme C65 Smartphone teased

దీంతోపాటు డైనమిక్‌ బటన్‌, రైడింగ్‌ మోడ్‌, స్మార్ట్‌ కోడ్‌ స్కానర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. పవర్‌ బటన్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌గా కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. దీర్ఘ చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఈ రియల్‌మి C65 స్మార్ట్‌ఫోన్‌ వియత్నంలో ఏప్రిల్‌ 4న విడుదల కానుంది. గెలాక్సీ బ్లాక్‌ మరియు వైలెట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందా లేదా అనే దానిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

రియల్‌మి C65 స్మార్ట్‌ ఫోన్‌ వియత్నంతోపాటు పిలిప్పెన్స్‌, మలేసియా, బంగ్లాదేశ్‌, ఇండోనేషియాలో త్వరలో లాంచ్‌ కానుందని రియల్‌మి వైస్‌ ప్రెసిడెంట్‌ Chase Xu తెలిపారు. దీంతోపాటు ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలిపారు. అయితే ఇతర వివరాలను వెల్లడించలేదు.

** భారత్‌ మార్కెట్‌లోకి ఏప్రిల్‌ 2 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సపోర్టును కలిగి ఉంది. సంస్థ ప్రకారం కేవలం 30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని తెలిపింది. తక్కువ ధర సెగ్మెంట్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తోంది.

దీంతోపాటు రియల్‌మి కొన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని ప్రకటన చేసింది. ఈ సెగ్మెంట్‌లో మెరుగైన ఫీచర్‌గా గుర్తించవచ్చు. దీంతోపాటు 6nm 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్‌ స్పీకర్లు కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 12X 5G మాత్రమేనని సంస్థ తెలిపింది. రూ.12000 ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా రియల్‌మి 12X 5G ఫోన్‌ అడ్వాన్సడ్‌ VC కూలింగ్‌ టెక్నాలజీతో వస్తోంది. ఈ ఫోన్‌ వృత్తాకార మెటల్‌ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్ ఫ్లాట్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌తో వస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C65 Smartphone teased design and key features revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X