Home
Mobile

రూ.7699 ధరకే 6300mAh బ్యాటరీ, 6.74 అంగుళాల డిస్‌ప్లే ఫోన్‌.. ఇవాళే కొనుగోలు చేయండి..!

Realme C71 smartphone : రియల్‌మి ఇండియా నుంచి మరో ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే ఈ ఫోన్‌ తక్కువ బరువు, ఆకట్టుకొనే డిజైన్‌ సహా భారీ బ్యాటరీలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. రివర్స్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ రియల్‌మి C71 4G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కూడా కలిగి ఉన్నాయి. దీంతోపాటు 1.8 మీటర్‌ డ్రాప్‌ టెస్ట్‌ ను కూడా నిర్వహించినట్లు రియల్‌మి చెబుతోంది. మరియు 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 90H రీఫ్రెష్‌ రేట్‌, 563 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

Realme C71 5G smartphone launched

చిప్‌సెట్‌ :
రియల్‌మి C71 స్మార్ట్‌ఫోన్‌ Unisoc T7250 ఆక్టా కోర్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Cortex A75, Cortex A55 ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G57 GPU ను కూడా అమర్చారు. రియల్‌మి C71 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI పైన పనిచేస్తుంది.

రెండు స్టోరేజీ వేరియంట్స్‌ :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. డైనమిక్‌ ర్యామ్‌ ఫీచర్‌తో ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. మరియు మైక్రో SD కార్డుతో స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

Realme C71 5G smartphone launched

6300mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి రెండు రోజులపాటు ఉపయోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 6w రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి C71 స్మార్ట్‌ఫోన్‌ f/2.2 అపేచర్‌, PDAF ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 13MP Omnivision OV13B ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ ఫోన్ AI Eraser, Pro Mode, Clear Face, డ్యూయల్‌ వ్యూ వీడియో వంటి ఎడిటింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక అల్గారిథంను వినియోగిస్తోంది. కాలింగ్‌ సమయంలో బ్యాగ్రౌండ్‌ నాయిస్‌ను తగ్గించేందుకు AI కాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 7.94mm స్లిమ్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉంది.

Realme C71 5G smartphone launched

రియల్‌మి C71 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి C71 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7699 గా ఉంది. మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8699 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.7999 కే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి వెబ్‌సైట్‌లోనే లభిస్తుందని తెలుస్తోంది. ఎంట్రీ లెవల్‌లో ఫోన్‌ చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C71 5G smartphone launched in india with 6300mAh Battery under 8k price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X