Home
Mobile

రూ.7199 ధరకే 6300mAh భారీ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్, ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌తో స్మార్ట్‌ఫోన్!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం జులైలో రియల్‌మి C71 స్మార్ట్‌ఫోన్‌ (Realme C71 Smartphone) విడుదల అయింది. ఈ ఫోన్‌ సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే, బ్యాటరీ పరంగానూ ఆకట్టుకుంటోంది. ఈ హ్యాండ్‌సెట్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రియల్‌మి C71 5G హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ ధరలు రూ.8,199, రూ.9,199 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 4GB/64GB వేరియంట్‌పై రూ.1000 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే రూ.7199 కే కొనుగోలు చేయవచ్చు.

Realme C71 Smartphone with 6300mAh battery now gets Rs1500 coupon code discount on amazon

రూ.1500 కూపన్‌ కోడ్ డిస్కౌంట్ :
అదే 6GB/128GB వేరియంట్‌పై రూ.1500 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే రూ.7699 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ సీ బ్లూ, ఒబ్సిడియన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఎత్తు నుంచి కిందపడినా డ్యామేజీ కాదు! :
రియల్‌మి C71 4G స్మార్ట్‌ఫోన్ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా 1.8 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ 7.94mm స్లిమ్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 563 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

Realme C71 Smartphone with 6300mAh battery now gets Rs1500 coupon code discount on amazon

ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్‌ Unisoc T7250 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G57 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ డైనమిక్‌ ర్యామ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ క్లియర్‌ ఫేస్‌, ప్రో మోడ్‌, డ్యూయల్‌ వ్యూ వీడియో, AI Eraser వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. కాలింగ్‌ సమయంలో బ్యాగ్రౌండ్‌ నాయిస్‌ను కట్టడి చేసేందుకు AI కాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంది.

6300mAh బ్యాటరీ :
రియల్‌మి C71 4G స్మార్ట్‌ఫోన్ 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ లో మరో బెస్ట్ ఫీచర్‌ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6W రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి 2 రోజులపాటు ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C71 Smartphone with 6300mAh battery now gets Rs1500 coupon code discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X