6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ట్రిపుల్ కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదలకానుందంటే..?
రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లో త్వరలో రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్ (Realme C73 5G Smartphone) విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల తేదీతోపాటు ఈ ఫోన్ డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి.
IP64 రేటింగ్ :
ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేట్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 7.94mm థిక్‌నెస్‌తో కూడిన స్లీక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

పంచ్ హోల్ డిజైన్ :
రియల్‌మి C73 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు వైపు పంచ్ హోల్ డిజైన్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు.
6000mAh భారీ బ్యాటరీ :
అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, స్టోరేజీ వేరియంట్స్‌తోపాటు ఎంత ధరలో అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కలర్ వేరియంట్స్ :
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే వివరాలను వెల్లడించలేదు. గతంలో వచ్చిన లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్, ఓనిక్స్ బ్లాక్, జాడే గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.
* రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ :
ఈనెల తొలివారంలో రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్, IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
రియల్‌మి C75 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 32MP కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13999 గా ఉంది. లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, పర్పుల్ బ్లూసమ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








