Home
Mobile

రూ.10,499 కే 6000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

Realme C73 5G Smartphone : రియల్‌మి గత నెలలో బడ్జెట్‌ రేంజ్ లో రియల్‌మి C75 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తాజాగా C సిరీస్‌లో మరో హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను కూడా బడ్జెట్‌ సెగ్మెంట్‌లోనే తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 720 x 1604 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

Realme C73 5G smartphone

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. దీంతోపాటు Arm Mali MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 4GB LPDDR4X ర్యామ్‌, 64GB, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

రెండు స్టోరేజీ వేరియంట్స్‌ :
ఈ ఫోన్‌ 4GB/64GB, 4GB/128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 2TB స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.

6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు f/1.8 అపేచర్‌తో 32MP GALAXYCORE GC32E2 కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ 5G, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 7.94 థిక్‌నెస్‌తో 197 గ్రాములు బరువును కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. ఈ ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రూ.500 డిస్కౌంట్‌ :
ఈ ఫోన్‌ను ప్రారంభ ఆఫర్‌లో భాగంగా EMI విధానంలో కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఒనిక్స్‌ బ్లాక్‌, క్రిస్టల్‌ పర్పుల్‌, జాడే గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Take a Poll

* గత నెలలో విడుదల అయిన రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెయిన్‌ వాటర్ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ సపోర్టు చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 32MP + 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Best Mobiles in India

English summary
Realme C73 5G smartphone launched with 6000mAh Battery in india, sale is live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X