Home
Mobile

6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ కలిగిన ఫోన్‌పై డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు!

రియల్‌మి భారత్ మార్కెట్‌ లో ఈ సంవత్సరం రియల్‌మి P3 సిరీస్, P4 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లను లాంచ్ చేసింది. దీంతోపాటు ఎంట్రీ, బడ్జెట్‌, మిడ్ రేంజ్‌ లోనూ అనేక మోడల్స్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సంవ‌త్సరం తొలి భాగంలో లాంచ్‌ అయిన రియల్‌మి C75 స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తోపాటు 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

కూపన్ కోడ్‌ డిస్కౌంట్ ఆఫర్‌ :
రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme C75 5G Smartphone Price drop) ప్రస్తుతం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. అమెజాన్‌ లో కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్ ద్వారా రూ.600 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అంటే ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

realme C75 5G smartphone

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్‌ లిలీ, లిలీ వైట్‌, పర్పుల్‌ బ్లూసమ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7.94mm థిక్‌నెస్‌తో స్లిమ్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ ను కూడా కలిగి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS :
రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది.

రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్ సూపర్ :
ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ ను వినియోగించుకోవచ్చు.

6000mAh బ్యాటరీ, రివర్స్‌ ఛార్జింగ్‌ :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి C75 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 32MP కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌ పుట్‌ కోసం 300% అల్ట్రా వాల్యూమ్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme C75 5G smartphone now available with Rs600 coupon code on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X