రూ.12 వేల ధరలో భారీ బ్యాటరీ, 128GB స్టోరేజీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో రియల్‌మి నుంచి ఇటీవల రియల్‌మి 15 సిరీస్ ఫోన్ లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్ లో ఇటీవలే రియల్‌మి 15T 5G స్మార్ట్ ఫోన్ కూడా విడుదల అయింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. అయితే ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి C75 స్మార్ట్ ఫోన్ ( Realme C75 Smartphone ) లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ లో (Flipkart Big Billion Days 2025 Sale) భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13999 గా ఉంది. ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. తడి చేతులతో కూడా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ధరలో రివర్స్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతోపాటు IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7.94mm థిక్‌నెస్ తో స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. 300 % అల్ట్రా వాల్యూమ్ మోడ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ లిల్లీ వైట్, మిడ్ నైట్ లిల్లీ, పర్పుల్ బ్లూసమ్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications





