రూ.12999 కే 6000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ 5G స్మార్ట్‌ఫోన్..!
Realme C75 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి తాజాగా బడ్జెట్ రేంజ్ లో ఓ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులోకి వచ్చినా 6000mAh బ్యాటరీ, స్లిమ్ డిజైన్‌ని కలిగి ఉంది. ఈ రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ (Realme C75 5G Smartphone Launched) ఫీచర్‌ల పూర్తి వివరాలు.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ :
రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజుల మన్నిక వచ్చేలా మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌తో విడుదల అయింది. దీంతోపాటు IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 7.94mm థిక్‌నెస్‌తో స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్ ను వినియోగించుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 2TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది.

32MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 32MP Galaxycore GC32E2 ఆటోఫోకస్ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు మరో కెమెరాను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
6000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 300 % అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, పర్పుల్ బ్లూసమ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రియల్‌మి C75 5G ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13999 గా ఉంది. ప్రస్తుతం రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








