Home
Mobile

బడ్జెట్‌ ధరలో 7000mAh భారీ బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్, 6.8 అంగుళాల డిస్‌ప్లేతో ఫోన్‌ విడుదల..!

రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌ లో గురువారం 10,001mAh భారీ బ్యాటరీతో రియల్‌మి నార్జో పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. కర్వడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ చిప్‌, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. మార్చి 10 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. తాజాగా రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Realme C83 5G Smartphone) లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ రేంజ్‌ లో విడుదల అయినా.. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. రేపటి నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

రియల్‌మి C83 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 16.7 మిలియన్ కలర్స్‌ ను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పా్ష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Realme C83 5G sale

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ రియల్‌మి ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ARM Mali G57 GPU కూడా ఉంది. ఈ ప్రాసెసర్‌ 6GB LPDDR4x ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీతో జత చేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా f/2.2 అపేచర్‌, ఆటోపోకస్, 77 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 13MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 30fps తో 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh టైటాన్‌ బ్యాటరీని కలిగి ఉంది. బడ్జెట్‌ ధరలో మెరుగైన బ్యాటరీ ఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది.

Realme C83 5G sale

రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, 3,5m ఆడియో జాక్, GPS, GLONASS, QZSS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌ ఉన్నాయి.

రియల్‌మి C83 5G ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.13,499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,499 గా ఉంది.

Realme C83 5G sale

ఈ ఫోన్‌ సేల్‌ మార్చి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభం ఆఫర్‌లో భాగంగా 6 నెలల నోకాస్ట్ EMI ఆప్షన్‌ తో కొనుగోలు చేయవచ్చు. స్పౌటింగ్‌ గ్రీన్, బ్లూమింగ్‌ పర్పుల్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C83 5G smartphone with 144Hz Refresh rate, 7000mAh Battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X