Home
Mobile

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, 7000mAh బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌ లో రియల్‌మి నుంచి ఇటీవలే రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. రూ.7999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ HD+ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్, 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే త్వరలో రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. తాజాగా విడుదల తేదీ సహా కీలక వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme C83 5G Smartphone) భారత్‌ మార్కెట్‌ లో మార్చి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ( Flipkart ) ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ఎంత ధరలో లాంచ్‌ కానుందో వెల్లడి కావాల్సి ఉంది.

Realme C83 5G Smartphone

7000mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో విడుదల కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 7000mAh టైటాన్‌ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 53 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఈ బ్యాటరీ మెరుగైన పనితీరును అందిస్తుందని రియల్‌మి చెబుతోంది.

890.5 గంటల స్టాండ్‌బై టైమ్‌ :
ఈ బ్యాటరీ 6 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును కనబరుస్తుందని రియల్‌మి చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 27.7 గంటలపాటు వీడియో స్ట్రీమింగ్‌ లేదా 159.8 గంటల మ్యాజిక్‌ ప్లేబ్యాక్ లేదా 58.5 గంటల కాలింగ్‌ లేదా 15.6 గంటల గేమింగ్‌ లేదా 890.5 గంటల స్టాండ్‌బై టైమ్‌ ను అందిస్తుందని తెలిపింది.

ఈ ఫోన్‌ AI పవర్‌ సేవింగ్ ఫీచర్‌ ను (AI Power saver feature) కూడా కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది. 400mAh బ్యాటరీతో సమానమైన ఛార్జింగ్‌ ను ఆదా చేస్తుంది. దీంతో 1.2 గంటల వీడియో ప్లేబ్యాక్‌ ను అదనంగా పొందవచ్చని చెబుతోంది. ఈ ఫోన్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. గేమింగ్‌ సమయంలో ఈ ఫీచర్‌ అనుకూలంగా పనిచేస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ 14000 మైక్రో డాప్‌ టెస్టులు పాసైనట్లు చెబుతోంది. 300 శాతం బెండ్‌ రెసిస్టెన్స్‌ ను అందిస్తుందని చెబుతోంది. ఈ ఫోన్ 48 నెలల వరకు స్మూత్‌ ఫెర్ఫామెన్స్‌ ను అందిస్తుందని తెలిపింది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

144Hz రీఫ్రెష్‌ రేట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ బ్లూమింగ్‌ పర్పుల్‌, స్ర్పాటింగ్ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C83 5G Smartphone with 7000mAh battery, 144Hz Refresh rate launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X