Home
Mobile

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, 7000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్లోకి ఇటీవల ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ రియల్‌మి GT 8 ప్రో ఇటీవల విడుదల అయింది. సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌, 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. అయితే త్వరలో రియల్‌మి C సిరీస్‌ నుంచి మరో మోడల్‌ లాంచ్ కానుంది.

రియల్‌మి C85 5G పేరుతో (Realme C85 5G Smartphone) విడుదల కానుంది. భారత్‌ మార్కెట్లో నవంబర్‌ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. సేల్‌ తేదీ సహా ఆఫర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ఆధారంగా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

Realme C85 5G Smartphon

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ SGS మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు IP69 ప్రో లెవల్‌ రేటింగ్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.5W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి, రెండు రోజులపాటు వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ తో 1.5 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా C85 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP సోనీ AI కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌, స్టోరేజీ సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి నుంచి త్వరలో P4x 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇటీవలే ఈ వివరాలు వెల్లడయ్యాయి. టిప్‌స్టర్‌ సుధన్షు అంబోర్‌ ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను లీక్‌ చేశారు. దీని ఆధారంగా ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో విడుదలయ్యే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ గురించి ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఈ ఫోన్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఒకేసారి 18 యాప్స్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది.

ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే భారత్‌ మార్కెట్‌లో రూ.20000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C85 5G Smartphone with 50MP sony Camera, 7000mAh Battery launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X