అరగంట నీటిలో ఉన్నా డ్యామేజీ కానీ 5G స్మార్ట్‌ఫోన్.. 7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా..!
రియల్‌మి సంస్థ ఇటీవలే రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్, 6.79 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 OS, 200MP టెలిఫోటో లెన్స్, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇటీవలే ఈ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. అయితే తాజాగా రియల్‌మి C సిరీస్ నుంచి మరో ఫోన్ లాంచ్ అయింది.
రియల్‌మి C85 5G పేరుతో స్మార్ట్‌ఫోన్ (Realme C85 5G Smartphone) లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఆకట్టుకొనే డిజైన్, 7000mAh భారీ బ్యాటరీ, వేపర్ చాంబర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు.

రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల HD+ LCD (720x 1510 పిక్సల్స్) డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
IP69 రేటింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 100 శాతం sRGB, 83 శాతం DCI-P3 కలర్ గామట్, 90.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 5300 Sq mm తో కూడిన వేపర్ ఛాంబర్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP69 ప్రో రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతో 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఉన్న డ్యామేజీ కాదని చెబుతోంది.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు ARM Mail G57 MC2 GPU తో పనిచేస్తుంది. డైనమిక్ ర్యామ్ ద్వారా 12GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో సౌకర్యవంతంగా 17 యాప్‌లను ఒకేసారి వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా రియల్‌మి హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 30 fps తో 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

ఈ ఫోన్ 45W SuperVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 22 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 50 గంటల కాలింగ్ లేదా 145 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చని రియల్‌మి తెలిపింది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, డ్యూయల్ బ్యాండ్ వైఫై, GPS, USB-C వంటి ఫీచర్లు ఉన్నాయి. గైరోస్కోప్, ఇ-కంపాస్‌స ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేటర్, ప్రాక్సిమిటీ సెన్సర్ లు ఉన్నాయి.
రియల్‌మి C85 5G ధర, సేల్ వివరాలు :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. తొలి సేల్‌లో రూ.500 డిస్కౌంట్‌తో రూ.14999, రూ.16499 కే కొనుగోలు చేయవచ్చు.
భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 1 తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్ పికాక్ గ్రీన్, పేరెట్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








