రూ.15 వేల ధరకు 30 నిమిషాలపాటు నీటిలో ఉన్నా డ్యామేజీ కానీ 5G స్మార్ట్‌ఫోన్!
Realme C85 5G Smartphone Sale : రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో ఇటీవల విడుదల అయింది. బడ్జెట్ ధరలో లాంచ్ అయినా.. అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ను ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.500 డిస్కౌంట్ :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ను రూ.500 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

రూ.14999 ప్రారంభ ధర :
ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ను రూ.14999, రూ.16499 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి C85 5G హ్యాండ్‌సెట్ ను ప్యారెట్ పర్పుల్, పికాక్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
144Hz రీఫ్రెష్ రేట్‌తో భారీ డిస్‌ప్లే :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతుంది.

నీటిలో ఉన్నా డ్యామేజీ కాదు! :
ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP69 ప్రో రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్నా డ్యామేజీ కాదని సంస్థ తెలిపింది. 36 రకాల ద్రవాల నుంచి రక్షణ పొందుతుందని తెలిపింది.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ARM Mail G57 MC2 GPU ను కలిగి ఉంది. 17 యాప్ లను సౌకర్యంగా ఒకేసారి ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. 5300 Sq mm తో కూడిన వేపర్ ఛాంబర్ ను కలిగి ఉంది
50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W SuperVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, Wi-Fi ఫీచర్‌లతోపాటు ఇ-కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్, ప్రాక్సిమిటీ సెన్సర్ లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








