Home
Mobile

రియల్‌మి C సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ Timeline సహా కీలక వివరాలు లీక్‌..!

రియల్‌మి నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌ లోకి C - సిరీస్‌ (Realme India) నుంచి స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న కొన్ని లీక్స్‌ ఆధారంగా రియల్‌మి C85 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్‌ వివరాలు.

ఈ నెలలోనే విడుదల! :
ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌ లో రియల్‌మి C85, రియల్‌మి C85 ప్రో మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. అయితే భారత్‌ మార్కెట్‌ లో రియల్‌మి C85 స్మార్ట్‌ఫోన్‌ ( Realme C85 Smartphone ) నవంబర్‌ నెలలోనే విడుదల కానుందని టిప్‌సెట్ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు. దీంతోపాటు మరిన్ని వివరాలను వెల్లడించారు.

realme C85 smartphone tipped to launch in india in november here are the expected specs  features

ఈ ఫోన్‌ తరహా ఫీచర్లు :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌ లో ఇటీవల రియల్‌మి 15x స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల తరహా లోనే C85 ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు చాలా వరకు ఉంటాయని తెలుస్తోంది. అయితే 15x మోడల్‌ తో పోలిస్తే C85 మోడల్ కెమెరా విభాగం పరంగా తక్కువ నాణ్యత కలిగిన లెన్స్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

50MP కెమెరా సహా..! :
రియల్‌మి C85 గ్లోబల్‌ మార్కెట్‌ వేరియంట్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే భారత్‌ లోనూ గ్లోబల్‌ వేరియంట్‌ తరహాలో డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్, OS సహా ఇతర ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

* రియల్‌మి 15x స్మార్ట్‌ఫోన్‌ :
భారత్‌ మార్కెట్‌ లో రియల్‌మి 15x స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.8 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆర్మర్‌ షెల్‌, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ తో అందుబాటులో ఉంది. ఫలితంగా పొరపాటున పడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ డ్యూయల్‌ మైక్‌ ను కలిగి ఉంది.

50MP + 50MP కెమెరాలు :
రియల్‌మి 15x హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ARM Mali G57 MC2 GPU ను కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX852 కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 60W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ప్లాన్‌ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది. మరో రెండు వేరియంట్స్‌ ధరలు రూ.17999, రూ.19999 గా ఉంది. ఆక్వా బ్లూ, మెరైన్‌ బ్లూ, మెరూన్‌ రెడ్‌ కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
realme C85 smartphone tipped to launch in india in november here are the expected specs, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X