Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13 వేల డిస్కౌంట్‌.. 120W ఛార్జింగ్‌ సపోర్టు, 6.78 అంగుళాల డిస్‌ప్లే సహా సూపర్ ఫీచర్లు..!

Realme GT 6 Smartphone : రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం జూన్‌ నెలలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ 120W SUPERVOOC ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి స్మార్ట్‌ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ధరలు అప్పుడు.. ఇప్పుడు :
రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.40999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.27999 గా ఉంది. అంటే రూ.13 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.42999 గా ఉండేది. ప్రస్తుతం రూ.32999 కే సొంతం చేసుకోవచ్చు. రూ.10 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

realme GT 6 5G Smartphone with 120W Charging Support gets Rs13000 Discount on flipkart 2025

రెండు కలర్‌ వేరియంట్స్ :
అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ రూ.44999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్‌ స్టాక్‌ లేదు. అయితే ఎప్పటికి అందుబాటులో వస్తుందో వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లూయిడ్‌ సిల్వర్‌, రాజోర్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ 8T LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR+ ను సపోర్టు చేస్తుంది.

ట్రిపుల్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT-808 (OIS) ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 టెలిఫొటో లెన్స్‌, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియోను రికార్డు చేయవచ్చు.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 3D టెంపర్డ్‌ డ్యూయల్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 120W వైర్‌ SUPERVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కేవలం 28 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme GT 6 5G Smartphone with 120W Charging Support gets Rs13000 Discount on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X