రియల్‌మి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు సహా లాంచ్ వివరాలు..!
రియల్‌మి నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి GT 6T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. నిన్నటి నుంచే సేల్ ప్రారంభం అయింది. అయితే తాజాగా రియల్‌మి Gt 6 స్మార్ట్ ఫోన్ విడుదలపై సంస్థ అధికారిక ప్రకటన చేసింది. భారత్ సహా అనేక దేశాల్లో ఈ హ్యాండ్ సెట్ విడుదల కానుందని వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్ సెట్ జూన్‌లో భారత్ మార్కెట్ లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.
అయితే రియల్‌మి GT 6 స్మార్ట్ ఫోన్ (Realme GT 6) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కొన్ని నివేదికల ఆధారంగా GT 6 స్మార్ట్ ఫోన్.. రియల్‌మి GT నియో 6 రీబ్రాండెడ్‌గా వస్తుందని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ X పోస్టు ఆధారంగా రియల్‌మి GT 6 జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా రియల్‌మి GT 6 స్మార్ట్ ఫోన్ భారత్ సహా ఇటలీ, పిలిప్పెన్స్, పోలాండ్, సౌదీ అరేబియా, టర్కీ, థాయ్‌లాండ్, మలేషియా, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
AI స్మార్ట్ లూప్, AI నైట్ విజన్, AI స్మార్ట్ రిమూవల్ మరియు AI స్మార్ట్ సెర్చ్ వంటి అత్యాధునిక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరో టిప్‌స్టర్ వివరాల ఆధారంగా రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. Adreno 735 GPU ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు 6.78 అంగుళాల FHD + అమోలెడ్ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణ పొందే అవకాశం ఉంది.
అయితే రియల్‌మి GT 6 స్మార్ట్ ఫోన్ GT 6 నియోకు రీబ్రాండెడ్‌గా వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో... GT 6 నియో స్మార్ట్ ఫోన్ 120W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే భారత్‌లో రియల్‌మి GT 6 కచ్చితంగా ఎప్పుడు లాంచ్ కానుందో వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








