రియల్‌మి తొలి AI స్మార్ట్‌ఫోన్... భారత్‌లో విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
రియల్‌మి నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి GT 6 (Realme GT 6 Smartphone) భారత్‌లో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించింది. భారత్‌లో సహా ఇతర దేశాల్లో జూన్ 20 న లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్‌ను తొలి AI ఫోన్ అని (Realme First AI Smartphone) తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల అనంతరం ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.
రియల్‌మి సంస్థ మరియు ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇటీవల చైనాలో విడుదలైన రియల్‌మి GT 6 నియో స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రియల్‌మి GT 6 లాంచ్ కానుందని తెలుస్తోంది.

రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. మరియు 120W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ Adreno 735 GPU తో జతచేయబడుతుందని అంచనా వేస్తున్నారు. 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది.
కెమెరాల పరంగా ఈ రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండనుంది.
ఈ హ్యాండ్‌సెట్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌తో వచ్చే అవకాశం ఉంది. మరియు డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.4, NFC, ఐఆర్ బ్లాస్టర్ మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు టిప్‌స్టర్ యోగేష్ ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను అంచనా వేశారు. రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ రూ.40000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అయితే రియల్‌మి GT 6 హ్యాండ్‌సెట్ గురించి పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications