50MP+50MP+8MP కెమెరాలు, 5500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్.. AI ఫీచర్‌లు, సేల్ వివరాలు..!!
రియల్‌మి GT 6 స్మార్ట్ ఫోన్ (Realme GT 6 Smartphone Launched) ఇవాళ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ తరహా AI ఫీచర్‌లు శాంసంగ్, గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లలో గుర్తించవచ్చు. ఈ రియల్‌మి GT 6 హ్యాండ్‌సెట్ జనరేటివ్ AI ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు స్పెసిఫికేషన్‌ల పరంగా 120W SuperVooc ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి GT 6 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1264*2780 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. HDR+, డాల్బీ విజన్ సపోర్టుతో లాంచ్ అయింది.

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 SoC పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూలింగ్ కోసం 3D టెంపర్డ్ డ్యూయల్ VC వ్యవస్థను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.69 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 808 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP శాంసంగ్ JN5 టెలిఫొటో సెన్సార్, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. దీంతోపాటు f/2.45 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

డాల్బీ విజన్ సపోర్టుతో 30fps వద్ద 4k వీడియోలను రికార్డు చేయవచ్చు. AI నైట్ విజన్ మోడ్ సహా AI స్మార్ట్ రిమోవల్, AI స్మార్ట్ లూప్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.4, GPS, NFC వంటి ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ 120W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో 0-50 శాతం బ్యాటరీ ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చు. అదే 0-100 శాతం ఛార్జింగ్‌ను 28 నిమిషాల్లో పూర్తిచేయవచ్చు.

రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్ ధర :
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.40,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, మరియు 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఫ్లూయిడ్ సిల్వర్ మరియు రాజోర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి GT 6 స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ్టి నుంచి జూన్ 24 అర్ధరాత్రి 12 గంటల వరకు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లు.. బ్యాంకు ఆఫర్‌లో భాగంగా రూ.4000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. మరియు ఆరు నెలలపాటు డిస్‌ప్లే డ్యామేజీ నుంచి రక్షణ పొందవచ్చు. ఎక్స్చంజీ ఆఫర్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








