ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు.. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ, 5500mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
రియల్‌మి గత సంవత్సరం మే నెలలో భారత్ మార్కెట్‌లో రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ప్రస్తుతం నాలుగు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 5500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.5000 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి ఫోన్ ధర :
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ (Realme GT 6T 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌లను రూ.5000 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.5000 కూపన్ డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ ధర తగ్గింది. 8GB ర్యామ్ వేరియంట్ రూ.32999 కి విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.28998 గా ఉంది. కూపన్ డిస్కౌంట్ ద్వారా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.23998 గా ఉంటుంది.
అదే 12GB ర్యామ్ వేరియంట్ రూ.35999 ధరకు విడుదల అయింది. రూ.30998 గా ఉంది. ఈ ఫోన్ పైనా రూ.5000 కూపన్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.25998 గా ఉంటుంది. అంటే సుమారు రూ.10 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ రియల్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5x మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తామని రియల్‌మి తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో రక్షణ పొందుతుంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.
కెమెరా వివరాలు :
ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మిరాకిల్ పర్పుల్, ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








