Home
Mobile

ధర రూ.30999 కి విడుదలైన ఫోన్‌ను రూ.23999 కే కొనుగోలు చేయవచ్చు.. ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే..!

రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం మే నెలలో లాంచ్ అయింది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్‌ 3 తో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌ జనవరి 23 వరకు అందుబాటులో ఉంది.

రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ (Realme GT 6T 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం 128GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్‌లను భారీ డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Realme GT 6T 5G smartphone get massive price cut in india

రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.30999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం రూ.23,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.39,999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం రూ.32999 కే సొంతం చేసుకోవచ్చు. జనవరి 23 వరకు ఈ ఆఫర్‌ (Discounts on Realme Smartphones) అందుబాటులో ఉంది.

రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్, ఫీచర్‌లు :
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.78 అంగుళాల (2789*1264 పిక్సల్స్‌) 3D LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది.

Realme GT 6T 5G smartphone get massive price cut in india

ఈ ఫోన్‌ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంది. మరియు డాల్బీ విజన్‌ ను సపోర్టు చేస్తుంది. రియల్‌మి 5G హ్యాండ్‌సెట్ మూడు రంగుల్లో భారత్‌ మార్కెట్‌లో లభిస్తుంది. మిరాకిల్‌ పర్పుల్‌, ఫ్లూయిడ్‌ సిల్వర్‌, రేజర్‌ గ్రీన్‌ కలర్ వేరియంట్స్‌ లో ఉంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 8MP సోనీ IMX355 కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్‌ 3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Realme UI 5.0 OS తో పనిచేస్తుంది. ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. 5G కనెక్టివిటీ, బ్లూటూత్‌, వైఫై సహా అనేక స్పెసిఫికేషన్‌ లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 6T 5G smartphone get massive price cut in india 2025 check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X