ధర రూ.29,999 కే 12GB ర్యామ్, 512GB స్టోరేజీ, 5500mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు!
భారత్ మార్కెట్‌లో రియల్‌మి నుంచి ఈ సంవత్సరం మధ్యలో రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ (Realme GT 6T 5G Smartphone Pricedrop) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు డిస్కౌంట్‌ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం నాలుగు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

512GB స్టోరేజీ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ :
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.26,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. 512GB స్టోరేజీ వేరియంట్‌పై ఏకంగా రూ.10000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్, మిరాకిల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి GT 6T 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2789*1264 పిక్సల్స్ రిజల్యూషన్, 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే డాల్బీ విజన్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది. రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 OS తో పనిచేస్తుంది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ Adreno 732 GPU జతచేసి ఉంది.
కెమెరా విభాగం పరంగా రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ స్మా్ర్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీ పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి హ్యాండ్‌సెట్ 5G, Wi-Fi, బ్లూటూత్, 5G, USB-C, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. IP65 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








