Home
Mobile

Amazon Sale 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 తగ్గింపు..!

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024 (Amazon Great indian Festival sale 2024) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ప్రస్తుతం ఈ అమెజాన్‌లో సేల్‌లో రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. మరియు నాలుగు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 5500mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ సంవత్సరం మే నెలలో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది.

రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 6T 5G Smartphone) ప్రస్తుతం నాలుగు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.29,998 గా ఉంది.

amazon great indian festival sale 2024 massive discount on Realme GT 6T 5G Smartphone

అమెజాన్‌ లైవ్‌ పేజీ ఆధారంగా (Realme GT 6T 5G Pricedrop) ఈ సేల్‌లో భాగంగా కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 3D LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2789*1264 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీప్రెష్‌ రేట్‌, 6000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డాల్బీ విజన్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. మరియు Adreno 732 GPU జతచేసి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.88 అపేచర్‌తో 50MP సోనీ LYT 600, f/2.2 అపేచర్‌తో 8MP సోనీ IMX355 కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 90 డిగ్రీ ఫీల్డ్‌ వ్యూతోపాటు f/2.4 అపేచర్‌తో 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.2, వైఫై 6, GPS, USB 2.0 -C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ ప్లూయిడ్‌ సిల్వర్‌, Razor గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024 వరకు మాత్రమే పరిమితం అవుతోందో లేదా ఇదే తగ్గింపు ధరకే అందుబాటులో ఉంటుందో సంస్థ వెల్లడించలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 6T 5G Smartphone gets huge discount on amazon great indian festival sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X