రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ కొత్త కలర్ వేరియంట్ విడుదల... ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు..!
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ మే నెలలో భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లూయిడ్ సిల్వర్, రజ్రో గ్రీన్ కలర్ రంగుల్లో లాంచ్ అయింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ మిరాకల్ పర్పుల్ రంగులో (Realme GT 6T Smartphone miracle purple colour variant) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త కలర్ వేరియంట్ సేల్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు.
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2780*1264 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది.

ఈ రియల్‌మి కొత్త కలర్ వేరియంట్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉండనుంది.
కూలింగ్ ఛాంబర్, 5500mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 9 లేయర్ 10014mm స్క్వేర్ 3D టెంపర్డ్ డ్యూయల్ VC గా ఉంది. ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా మరియు 8MP సోనీ IMX355 వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు Prolight 2.0 అల్ట్రా సెన్సిటివ్ నైట్ సీన్ అల్గారిథమ్, స్ట్రీట్ ఫోటో మోడ్ 4.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 32MP కెమెరాను కలిగి ఉంది.
ఈ మిరాకల్ పర్పుల్ కలర్ వేరియంట్.. కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.32999, 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది.
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ సేల్ :
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ మిరాకల్ పర్పుల్ కలర్ వేరియంట్ ను జులై 20 నుంచి కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com, అమెజాన్ సహా ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








