Home
Mobile

ఈ ఫోన్‌లపై రూ.3000 డిస్కౌంట్‌.. ఏకంగా 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాలు సహా బెస్ట్‌ ఫీచర్లు..!

Realme GT 7 Series : రియల్‌మి నుంచి ఇటీవల GT 7 సిరీస్‌ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇందులో భాగంగా రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా బెస్ట్‌ సెల్లర్‌ డే లో భాగంగా ఈ రెండు ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటన చేసింది. జూన్‌ 10 నుంచి 13 వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్‌ EMI, ఎక్స్ఛేంజీ బోనస్‌ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 6000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది.

realme best seller days june 2025

ఈ ఫోన్‌ 120W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కేవలం 40 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని రియల్‌మి చెబుతోంది. 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ PUBG, BGMI కోసం 120fps సపోర్టు చేస్తుంది. IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. AI ట్రాన్స్‌లేటర్‌, AI ల్యాండ్‌స్కేప్‌+, AI గ్లేర్‌ రిమూవల్‌ వంటి AI ఫీచర్లున్నాయి. బ్లూటూత్‌ 5.4, Wi-Fi 7, NFC, GPS వంటి ఫీచర్‌లున్నాయి.

రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.46,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఎక్స్ఛేంజీ బోనస్‌ కూడా అందుకోవచ్చు.

realme best seller days june 2025

రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7T Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 Max చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. బ్లూటూత్‌ 6, WiFi 6, GPS, NFC ఫీచర్‌లున్నాయి.

రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.34,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఎక్స్ఛేంజీ బోనస్‌ సదుపాయం కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Realme GT 7 and GT 7T Smartphone gets rs3000 bank discount on amazon and realme online store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X