7000mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్, ఆకట్టుకొనే డిజైన్‌తో రియల్‌మి 5G ఫోన్‌లు.. రేపే విడుదల..!
రియల్‌మి GT 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (Realme GT 7 Series) రేపు మధ్యాహ్నం 1.30PM గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి GT 7 మరియు GT 7T స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫోన్‌లు 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానున్నాయి.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ (Realme GT 7 Smartphone) 1.5k ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీ ని సపోర్టు చేస్తుంది. మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7700mm కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 50MP మరియు 50MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో సుమారుగా రూ.45000 కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ (Realme GT 7T Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. మరియు 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 Max SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 తో పనిచేస్తుంది.
కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ GT 7T స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. బ్లూటూత్ 6.0, వైఫై 6, NFC ఫీచర్లను కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.35 వేలుగా ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








