Home
Mobile

30 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్, 50MP +50MP కెమెరాల 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్.. ఆఫర్‌ 2 రోజులే..!

రియల్‌మి నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్‌ రియల్‌మి GT 7 ప్రో హ్యాండ్‌సెట్ గత సంవత్సరం నవంబర్‌లో భారత్‌లో లాంచ్ (Realme India) అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5800mAh బ్యాటరీ, IP68 రేటింగ్‌తో అందుబాటులో ఉంది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ను రిపబ్లిక్‌ డే సేల్‌ లో (Realme Republic day sale 2025) భాగంగా భారీ డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ మార్కెట్‌ లో రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7 Pro 5G Smartphone) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 12GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.59,999 గా ఉండగా.. ప్రస్తుతం రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ (realme.com) లో రూ.54,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్‌ అందిస్తోంది.

Realme GT 7 Pro 5G smartphone

ఆఫర్‌ మరో రెండు రోజులపాటు మాత్రమే :
అదే 16GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.65,999 కు విడుదల అయింది. ప్రస్తుతం రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు రూ.6000 డిస్కౌంట్‌ ను పొందుతోంది. గెలాక్సీ గ్రే, మార్స్‌ ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ మరో రెండు రోజులపాటు మాత్రమే ఉంటుంది.

రియల్‌మి GT 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల FHD+ LTPO అమోలెడ్‌ క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Realme GT 7 Pro 5G smartphone

ఈ హ్యాండ్‌సెట్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ చేస్తుందని రియల్‌మి చెబుతోంది.

రెండు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి GT 7 ప్రో 5G ఫోన్ 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంది.

WiFi 6, బ్లూటూత్‌ 5.4 ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు అల్యూమినియంతో కూడిన AG గ్లాస్‌ను అమర్చి ఉంటుంది. మరియు ఈ డిస్‌ప్లే HDR 10+, డాల్బీ విజన్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro 5G smartphone received RS6000 discount in republic day sale 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X