6.78 అంగుళాల డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ 5G ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్!
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు అనేక ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ (Realme GT 7 pro Smartphone) విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.65,999 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో రూ.54998, రూ.59998 గా ఉంది. అంటే సుమారు రూ.5 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

రూ.8000 కూపన్ కోడ్ డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో 12GB ర్యామ్ వేరియంట్‌పై రూ.8000 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా రూ.46998 కే కొనుగోలు చేయవచ్చు. అదే 16GB ర్యామ్ వేరియంట్ రూ.7000 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే రూ.52998 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది ?
ఈ కూపన్ కోడ్ డిస్కౌంట్ ఆఫర్ జూన్ 17 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రియల్‌మి GT 7 ప్రో ఫోన్ గెలాక్సీ గ్రే, మార్స్ ఆరెంజ్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు :
రియల్‌మి GT 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ LTPO అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు 120W ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 తో పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరాలతోపాటు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
రూ.50 వేల ధరలో పవర్‌ఫుల్ చిప్‌సెట్, మెరుగైనె కెమెరాలు, భారీ డిస్‌ప్లే ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మి GT 7 Pro స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications