Home
Mobile

రేపు భారత్‌లోకి రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌తో వచ్చే తొలి ఫోన్‌..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి రేపు (అక్టోబర్ 26) రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7 Pro Smartphone) లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ చిప్‌సెట్‌ లో భారత్‌ లో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. భారత్‌ లో ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ (Amazon) ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లైవ్ పేజీ అందుబాటులో ఉంది. ఈ రియల్‌మి ఫోన్‌ 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే చైనా మార్కెట్‌ లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌ మార్కెట్‌ లో అక్టోబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఫ్లాగ్‌షిప్‌ హ్యాండ్‌సెట్‌ గా అందుుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు వెల్లడయ్యాయి.

Realme GT 7 Pro Smartphone

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 6500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OriginOS తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుందని తెలుస్తోంది.

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన డిజైన్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాలతో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంటుందని సమాచారం.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌ తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుందని సమాచారం. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ గురించి మరింత సమాచారం విడుదల సందర్భంగా రేపు వెల్లడి కానుంది. రూ.40,000 కంటే ఎక్కువ ధరకు భారత్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. సేల్‌ వివరాలు రేపు విడుదల సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro Smartphone is launching on tomorrow in india with snapdragon 8 Elite Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X