Home
Mobile

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్‌.. 6000mAh బ్యాటరీ, 50MP టెలిఫోటో కెమెరా సహా...??

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల భారత్‌ మార్కెట్లో వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7 Pro Smartphone) త్వరలో భారత్‌లో విడుదల కానుంది. రియల్‌మి వైస్‌ ప్రెసిడెంట్‌ Chase Xu ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే ఈ హ్యాండ్‌సెట్ తొలుత చైనాలో విడుదల కానుంది. అనంతరం భారత్ సహా ఇతర మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక లీక్‌లు వచ్చాయి.

అయితే తాజాగా రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, కెమెరా, స్టోరేజీ వంటి వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ లీక్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 1.5k 8T LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ ఆధారంగా డిస్‌ప్లే వివరాలు వెల్లడయ్యాయి.

Realme GT 7 pro Smartphone

దీంతోపాటు ఈ రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 3X జూమింగ్ సామర్థ్యంతో 50MP పెరిస్కోప్‌ టెలీఫోటోను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు బ్యాటరీ విషయానికి వస్తే భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఈ టిప్‌స్టర్ ఆధారంగా 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB ర్యామ్‌ మరియు 1TB స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం చివర్లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే పైన పేర్కొన్న స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్టోరేజీ వేరియంట్‌లు, ధర సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

** జూన్‌ 5 వ తేదీన భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 450 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది.

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్ 50MP AI ఆధారిత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఎయిర్‌ గెశ్చర్‌, డైనమిక్ బటన్‌, మిని క్యాప్సుల్‌ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI తో వస్తుంది. Unisoc T612 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Mali G57 GPU తో జతచేయబడి ఉంటుంది. 4GB LPDDR4x ర్యామ్‌, గరిష్ఠంగా 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499, అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 7 pro Smartphone key specifications leaked full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X