Home
Mobile

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. ఈ చిప్‌సెట్‌తో లాంచ్‌ కానున్న తొలి హ్యాండ్‌సెట్‌ ఇదే..

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి GT 7 ప్రో త్వరలో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం కొత్త చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుంది. గత నెలలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో క్వాల్‌కాం ఈ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా రియల్‌మి GT 7 ప్రో గుర్తింపు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇవాళ చైనాలో విడుదల కానుంది. అయితే భారత్‌ మార్కెట్‌లో విడుదల తేదీని సంస్థ (Realme GT 7 Pro Smartphone launch Date) తాజాగా ప్రకటించింది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాగ్‌షిప్‌ డివైస్‌గా అందుబాటులోకి వస్తుంది. మరియు ఈ సంవత్సరం జూన్‌లో విడుదలైన రియల్‌మి GT 6 హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఏఐ సూపర్‌ రిజల్యూషన్‌, ఏఐ స్కెచ్‌ టూ ఇమేజ్‌, ఏఐ మోషన్‌ డీబ్లర్‌ టెక్నాలజీ వంటి ఫీచర్‌లతో విడుదల కానుంది.

Realme GT 7 Pro Smartphone launch date confirmed in india

ఎప్పుడు విడుదల కానుందంటే? : భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 26 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. భారత్‌ మార్కెట్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌తో విడుదల కానున్న తొలి ఫోన్‌ ఇదేనని రియల్‌మి తెలిపింది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్‌ అయ్యాయి.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 2780*1264 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ మరియు HDR10+ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP + 50MP కెమెరాలు సహా 8MP కెమెరాతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఈ రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంటుందని సమాచారం.

120W, 6500mAh బ్యాటరీ :
దీంతోపాటు ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో భారత్‌ మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. 120W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ర్యామ్ సహా ఇతర వివరాలను వెల్లడి కావాల్సి ఉంది.

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ సహా ఇతర స్టోరేజీ, కనెక్టివిటీ ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై రియల్‌మి ఎటువంటి ప్రకటన చేయలేదు.

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro Smartphone launch date confirmed in india expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X