Home
Mobile

50MP + 50MP కెమెరాలు, 12GB ర్యామ్, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌.. ధర, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ (Realme GT 7 Pro Smartphone Launched) విడుదల అయింది. గత మోడల్‌ కంటే ఎన్నో అప్‌గ్రేడ్‌లతో ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ అయింది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు 12GB, 16GB ర్యామ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మార్స్‌ ఆరెంజ్‌ మరియు గెలాక్సీ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్‌ వివరాలు.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ LTPO అమోలెడ్‌ క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ HDR 10+, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు అల్యూమినియంతో కూడిన AG గ్లాస్‌ ను కలిగి ఉంది.

Realme GT 7 Pro Smartphone launched in india

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 16MP కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని రియల్‌మి సంస్థ చెబుతోంది. IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.4, NFC ఫీచర్లను కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్‌ (Realme GT 7 Pro Smartphone sale) నవంబర్ 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.56,999 గా ఉంది. అదే 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.62,999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro Smartphone launched in india with snapdragon 8 Elite chipset full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X